Monday, April 29, 2024

56 ఏళ్ల తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య గూడ్స్ రైలు సేవలు

భారత్-బంగ్లాదేశ్ మధ్య దాదాపు 56 ఏళ్ల తర్వాత గూడ్స్ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి నిన్న ఓ గూడ్స్ రైలు బంగ్లాదేశ్‌కు వెళ్లింది.  పునరుద్ధరించబడిన హల్దిబారి – చిలహతి మార్గం మీదుగా మొదటి గూడ్స్ రైల్ అలిపుర్దార్ డివిజన్‌లోని డామ్ డిమ్ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఈ మార్గం ద్వారా ఇరు దేశాల మధ్య ముఖ్యంగా అస్సాం,బెంగాల్ నుండి అతి తక్కువ ఖర్చుతో వస్తువులను రవాణా చేయటానికి వీలు లభించింది.

హల్దిబారి- చిలహతి మార్గాన్ని 17 డిసెంబరు 2020న భారత ప్రధాని నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. అయితే, కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ మార్గంలో అధికారికంగా రైలు సేవలు ప్రారంభం కాలేదు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని దిమ్‌ దిమ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్‌కు గూడ్స్ రైలు ప్రయాణం ప్రారంభించింది.

గతంలో ఈ మార్గంలో 1965 వరకు రవాణా జరిగింది. హల్దిబారి – చిలహతి మార్గం అస్సాం, పశ్చిమ బెంగాల్, నేపాల్, భూటాన్ నుండి బంగ్లాదేశ్‌కి వస్తువుల రవాణా చేస్తుంది. ఈ ప్రయాణానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ప్రధాన పోర్టులు, మధ్య తరగతి పోర్టులు, భూ సరిహద్దులలో ప్రాంతీయ వాణిజ్యం అభివృద్ధికి, ఈశాన్య ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ రైలు ఉపయోగపడనుంది. దక్షిణాసియా దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కూడా ఈ లింక్ ఉపయోగపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement