Wednesday, May 1, 2024

Breaking: ల‌వ్ పేరుతో న‌ర్స్‌తో ఎఫైర్‌.. ఆ పని తీరాక ముఖం చాటేశాడు..

ప్రేమ పేరుతో వంచించిన వ్య‌క్తిపై చీటింగ్ కేసు న‌మోదైంది. ఈమేర‌కు హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేష‌న్‌లో దాఖ‌లైన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదే చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిమ్స్‌లో ప‌నిచేస్తున్న ఓ న‌ర్స్‌ని ప్రేమిస్తున్నాన‌ని న‌మ్మించాడో వ్య‌క్తి. దాంతో అత‌నితో అన్ని విధాల త‌ను ఏక‌మైంది. వారిద్ద‌రి మ‌ధ్య చాలా కాలంగా ఎఫైర్ సాగింది. అయితే.. తీరా ఆ న‌ర్స్ కు ప్రెగ్సెన్సి రావ‌డంతో త‌ను తప్పించుకుని తిరుగుతున్నాడు. అస్సలు కనిపించకుండా ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఆమె ఫిర్యాదు మేర‌కు నిందితుడిపై చీటింగ్ కేసు న‌మోదు చేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement