Saturday, May 4, 2024

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు – నేడు ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

మామిడి తోరణాలు, పూలు, విద్యుత్తు దీపాలతో ఆలయాలను అలంకరించడంతోపాటు వేద పారాయాణం, అభిషేకాలు, హోమాలు, హరికథలు, కవి సమ్మేళనం, సత్కారాలు, శాస్త్రీయ సంగీతం – నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కొత్తగా 2,043 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలుకు శ్రీకారం చుట్టనునట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తుండగా, కొత్త వాటితో కలుపుకుని మొత్తం 6,661 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు కానుంది అన్నారు. ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామని సీయం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే ఈ హామీని అమలు చేస్తామని తెలిపారు.

ఆధ్మాత్మిక దివస్ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు. నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి మిల్లెట్ ప్రసాద సేవలను ప్రారంభించడం, ఆధ్మాత్మిక దినోత్సవం సందర్భంగా భక్తులకు ఉచితంగా మిల్లెట్ ప్రసాదాన్ని అందజేయడంతో పాటు, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బంగారం, వెండి నాణేల అమ్మకం, ఆన్ లైన్ టికెట్ సేవల ప్రారంభం, రాయగిరి వేదపాఠశాల నిర్మాణానికి భూమిపూజ, అన్నదాన సత్రం ప్రారంభం, ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement