Sunday, April 28, 2024

మార్చి15న‌ స‌ర్ ప్రైజ్ – హీరో అడివి శేషు

మార్చి 15న మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ బ‌ర్త్ డే. లెజెండ్ పుట్టిన‌రోజు ప్ర‌త్యేకంగా ప్లాన్ చేశామ‌ని న‌టుడు అడివిశేష్ తెలిపాడు. మేజ‌ర్ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు అడివి శేషు. 26/11 అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషించడం వలన అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు ..అడివి శేషు మేజర్ కుటుంబంతో సత్సంబంధాలను కొనసాగించాడు. ఈ ప్రాజెక్ట్ తన జీవితంలో జరిగిన మంచి విషయాలలో ఒకట‌ని తెలిపాడు.శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటించారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, మరియు మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement