Friday, March 29, 2024

ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిల మధ్య ఆసక్తికర చిట్ చాట్

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. తమ గురించి చాలా మాట్లాడుతున్నావు ఏంటి..? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మా బాస్ ను ఒక్క మాట అంటే వంద మాటలంటాము.. బరాబర్ గా అంటాము అని జీవన్ రెడ్డి అన్నారు. తాను సీఎం కేసీఆర్ ను ఏం అనలేదు.. మీడియా వాళ్లు కేసీఆర్ కు హెల్త్ బాగలేదంటే.. 5 రాష్ట్రాల రిజల్ట్స్ చూసి ఏమో అని అన్న.. హాస్పిటల్ కు వెళ్లిన విషయం తెలియదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

తనకు పై నుండి ఆదేశాలు  ఉన్నందునే .. నిన్ను తిట్టాను అని జీవన్ రెడ్డి అన్నారు. దీనికి తెలంగాణ మేము తెస్తే మమ్మల్నే తిడుతున్నారని రాజగోపాల్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసినందుకు మీ కుటుంబంపై మాకు గౌరవం ఉంటుందని జీవన్ రెడ్డి అన్నారు. మేము.. సోనియా గాంధీని ఎప్పుడూ విమర్శించం.. ఆమె తెలంగాణ ఇచ్చిన దేవత.. మేము రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ను తిడతాం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రాదని, మరో 20 ఏళ్లు టీ.ఆర్.ఎస్ అధికారంలో ఉంటుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement