Saturday, April 27, 2024

ఆది పినిశెట్టి బ‌ర్త్ డే : ఫ‌స్ట్ లుక్ రిలీజ్


ఓవైపు హీరోలుగా.. మ‌రోవైపు విల‌న్స్ గా త‌మ స‌త్తాని చాటుతున్నారు ప‌లువురు న‌టులు. వారిలో ఆది పినిశెట్టి కూడా ఒక‌రు.హీరోగా స‌త్తా చాటుతూనే విల‌నిజాన్ని ప్రేక్ష‌కుల‌కి చూపిస్తున్నాడు. కాగా నేడు ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం నుండి పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హీరో రామ్ , డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా ఈ న‌టిస్తుంది. ఈ చిత్రానికి ఉస్తాద్ టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టు స‌మాచారం. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్‌లో ‘ఉస్తాద్’ టైటిల్‌ కూడా రిజిస్టర్ చేసారు. టైటిల్ ను మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే తరువాయి. ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈమూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

కాగా హీరో రామ్ కి ఇది 19వ సినిమా. ఆదిపినిశెట్టి పోస్ట‌ర్ లో విలన్ గా స్టయిలీష్ గడ్డంతో హ్యాండ్ సమ్ లుక్ లో కనిపించారు. ఆది పినిశెట్టి ‘సరైనోడు’, ‘రంగస్థలం’, ‘నిన్ను కోరి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. స‌రైనోడు త‌ర్వాత మ‌ళ్లీ విల‌న్‌గా చేయాలంటే పాత్ర‌లో ఏదైనా ప్ర‌త్యేక‌త ఉండాలి. ఆ రేంజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ దొరికితే విలన్ గా చేస్తానని గతంలో చెప్పారు . రామ్ సినిమాలో అలాంటి పాత్ర దొరకడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లింగుసామి చెప్పిన కథ విన్నాక ఇది సాధారణ సినిమాల్లో విల‌న్ పాత్ర‌లా అనిపించకపోవడంతో.. వెంటనే సినిమా ఒప్పుకున్నానన్నార‌ట‌. ఈ సినిమాలో ఆది క‌డ‌ప, క‌ర్నూల్‌కు చెందిన రా అండ్ ర‌స్టిక్ రోల్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement