Monday, April 29, 2024

Breaking: నటి శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ అరెస్ట్

నటి శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధాంత్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సిద్ధాంత్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో పాజిటివ్ రావడంతో బెంగళూరులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగిన ఓ పార్టీలో నిషేదిత డ్రగ్స్‌ను వాడుతున్నారన్న పక్కా సమాచారంతో నగర పోలీసులు దాడులు చేశారు. ఇందులో డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో బాలీవుడ్ నటి, సాహో మూవీ ఫేం శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఆరుగురు ప్రముఖులను సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement