Saturday, April 27, 2024

‘నిహారిక’ ఇన్ స్టా అకౌంట్ డీ యాక్టివేష‌న్ పై స్పందించిన నాగ‌బాబు

చైత‌న్య‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత నిహారికి సినిమాల‌కు దూరంగా ఉంటోంది. కానీ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ వస్తుంది. కానీ అనుహ్యంగా తన ఇన్‏స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడంతో ఆమె అభిమానులు షాకయ్యారు. నిహారిక సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేయడంతో నెట్టింట్లో పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాను ఇన్ స్టా అకౌంట్ డెలిట్ చేయడానికి గల కారణాన్ని తెలియజేయలేదు.. దీంతో ఆమె ఇన్ స్టా అకౌంట్ డెలిట్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ విషయంపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే.. సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు. తాజాగా తన ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహించాడు నాగబాబు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. నిహారిక ఇన్‏స్టా అకౌంట్ డీ యాక్టివేషన్ గురించి చెప్పమని అడిగాడు ఇందుకు నాగబాబు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. నేనే కోడింగ్ నేర్చుకుని హాక్ చేసి నిహారిక ఇన్ స్టా అకౌంట్ డెలిట్ చేశాను. డీకోడింగ్ నేర్చుకోగానే రీ యాక్టివేషన్ చేస్తానంటూ బ్రహ్మనందం ఎమోజీతో రిప్లై ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement