Thursday, May 9, 2024

డీ గ్లామ‌ర్ రోల్ లో కీర్తి సురేశ్ – హిట్ట‌య్యేనా

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా హిట్టు కోసం ఎంత‌గానో ఎదురుచూస్తోంది హీరోయిన్ కీర్తి సురేశ్. ప్ర‌స్తుతం ఈమె ‘సాని కాయిద‌మ్’ అనే త‌మిళ సినిమాలో న‌టించింది. ఇప్ప‌టికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేట్రిక‌ల్ రిలీజ్‌ను స్కిప్ చేసి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం నేరుగా ఏప్రిల్ 8నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. అరుణ్ మ‌తేశ్వ‌ర‌ణ్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రంతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ న‌టుడిగా ప‌రిచ‌య‌వుతున్నాడు. ‘7/G బృందావ‌న్ కాల‌నీ’, ఆడ‌వారిమాట‌ల‌కు అర్థాలే వేరులే’, ‘యుగానికి ఒక్క‌డు వంటి’ సినిమాల‌కు సెల్వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రంలో సెల్వరాఘ‌వ‌న్ చెల్లెలిగా కీర్తీ సురేష్ న‌టించింది. ఎలాంటి అంచ‌నాల్లేకుండా షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం గ‌తేడాది విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాల‌ను న‌మోదు చేసింది. తాజాగా విడుద‌లైన సెల్వ‌రాఘ‌వ‌న్ పోస్ట‌ర్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. 1980ల‌లో సాగే రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కింది. సెల్వ‌రాఘ‌వ‌న్‌, కీర్తీసురేష్ ఇద్ద‌రూ ఈ చిత్రంలో డీ గ్లామ‌ర్‌గా న‌టించారు. ఇక కీర్తీ సురేష్ ప్ర‌స్తుతం తెలుగులో ‘స‌ర్కారువారి’ పాట సినిమాతో బిజీగా గడుపుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement