Friday, May 3, 2024

ఆచార్య‌లో కాజ‌ల్ పాత్ర‌ని తొల‌గించాం – కొర‌టాల శివ‌

ఆచార్య చిత్రంలో హీరోయిన్ గా కాజ‌ల్ పాత్ర లేద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ వెల్ల‌డించారు. సరైన ప్రాధాన్యత లేని పాత్రలో హీరోయిన్ ను వాడుకోవడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమన్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాత్రకు ప్రేమపై ఆసక్తి ఉండదని… అయితే కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని కాజల్ పాత్రను చొప్పించడానికి ట్రై చేశానని తెలిపారు. తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూశానని… తనకు సంతృప్తిగా అనిపించలేదని చెప్పారు. ఇదే విషయాన్ని చిరంజీవితో చెపితే… కాజల్ పాత్రను ఉంచాలా.. వద్దా.. అనే విషయాన్ని తనకే వదిలేశారని కొరటాల శివ అన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాజల్ కు చెప్పానని… ఆమె నవ్వుతూనే స్పందించిందని చెప్పారు. దీంతో, ‘ఆచార్య’ నుంచి కాజల్ పాత్రను పూర్తిగా తప్పించామని అన్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిందని చెప్పారు. ఈ చిత్రంలో సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement