Tuesday, November 28, 2023

ఆప్ మంత్రికి తీహార్ జైలులో రాచమర్యాదలు.. అది బీజేపీ కుట్ర అంటున్న కేజ్రీవాల్ స‌ర్కార్..

ఆప్ పార్ట‌కి చెందిన‌ మంత్రి సత్యేంద్ర జైన్‎కు తీహార్ జైలులో రాచ మర్యాదలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు కారాగారంలోనూ వీఐపీ ట్రీట్ మెంట్, బాడీ మసాజ్ లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా జైలులో మంత్రికి సౌకర్యాలు అందిస్తున్నారు. దీంతో జైలు ముందు కేజ్రీవాల్ మసాజ్ సెంటర్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ వ్యవహారాన్ని కేజ్రీవాల్ స‌ర్కార్ ఖండించింది. ఇదంతా బీజేపీ కుట్ర అని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement