Wednesday, May 1, 2024

Pic of the Day| డ్రాపర్​ ద్వారా పాలు తాగుతున్న ఉడుత!

మండే ఎండలకు మనుషులే కాదు.. జీవరాశులన్నీ అల్లాడిపోతున్నాయి. ప్రస్తుతం రోజువారీ టెంపరేచర్లు 40 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. దీంతో జంతువులు, పక్షులు, వన్యప్రాణులన్నీ నీటికి తపించిపోతున్నాయి. అయితే.. చెన్నైలో ఓ వ్యక్తి తాగునీటికి తండ్లాడుతున్న ఓ ఉడుతకి పాలు పడుతున్న దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. అయితే.. ఈ ఫొటో నెట్టింట పోస్టు చేయడంతో అద్భుతంగా ఉందంటూ చాలామంది పాజిటివ్​ కామెంట్స్​ చేస్తున్నారు. ఆ మహామనిషి సహృదయతను కొనియాడుతున్నారు. అందుకే ఈ ఫొటో ‘‘ఫిక్​ ఆఫ్​ ద డే’’గా నిలిచింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇది కూడా చదవండి : Spl Story | కూరగాయలకు కేరాఫ్​ రంగారెడ్డి జిల్లా.. మహానగరానికి పెద్ద ఎత్తున సప్లయ్​!

Advertisement

తాజా వార్తలు

Advertisement