Friday, May 10, 2024

Spl Story | దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. చరిత్రలో నిలిచిపోయే అపూర్వ ఘట్టం!

దేశంలో ఇవ్వాల మూడు కీలక పరిణామాలు జరిగాయి. శ్రావాణ మాసం తొలిరోజు మంగళవారం చరిత్రలో మరిచిపోలేని రోజుగా నిలిచిపోనుంది. రెండు రాజకీయానికి సంబంధించినవి కాగా, మరొకటి దేశ ప్రతిష్ఠకు ఎంతో కీలకమైనది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్​ చంద్రయాన్​–3ని చంద్రుని దిశగా పయనింపజేసే క్రమంలో మరో మెట్టు పైకి చేర్చింది. ఇక.. రాజకీయాల్లో రెండు కూటములు ఒకేరోజు భేటీ కావడం గమనార్హం. ఇందులో ప్రతిపక్షాలన్నీ కలిసి తమ కూటమి (ఇండియా)ని ప్రకటించగా.. లోక్​సభలో ఎలాంటి ప్రాతినిథ్యం లేని చిన్న చితకా పార్టీలను చేరదీస్తూ బీజేపీ (ఎన్​డీఏ) సమావేశం నిర్వహించింది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

జులై 18న న్యూఢిల్లీ, బెంగళూరులో రాజకీయంగా ముఖ్యమైన రెండు సమావేశాలు జరిగాయి. దేశ రాజధానిలో జరిగిన సమావేశం జాతీయ అభివృద్ధి కూటమి (ఎన్‌డీఏ)లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ప్రస్తుత, కొత్త మిత్రపక్షాలన్నీ ఒకచోట చేరాయి. బెంగళూరులో జరిగిన మరో భేటీలో.. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమి -ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. 2024 ఎన్నికలు 26 పార్టీల ప్రతిపక్ష కూటమికి పేరుగాంచిన ఎన్‌డీఏ వర్సెస్ ఇండియా అనే రెండు బలమైన కూటముల మధ్య పోటీ ఉండనున్నట్టు కనిపిస్తోంది. ఎన్డీఏలో 38 పార్టీలున్నాయి, ఆ పార్టీల నేతలంతా ఢిల్లీలోని అశోక్ హోటల్‌లో ఇవ్వాల భేటీ అయ్యారు. ఎన్డీఏలోని 38 పార్టీల్లో 24 పార్టీలకు లోక్‌సభలో ప్రాతినిథ్యం అస్సలే లేదు. మరో ఏడు పార్టీలకు ఒక ఎంపీ ఉండగా.. రెండు పార్టీలకు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు.

- Advertisement -

కాగా, ఇవ్వాల జరిగిన ఈ రెండు రాజకీయ పార్టీల భేటీలు మైండ్‌గేమ్‌గా చెప్పుకోవచ్చు. రెండు వర్గాలు కూడా తమ సత్తా చాటుకునేలా వ్యవహరించాయి. రాజకీయ పునర్నిర్మాణం దిశగా రెండు కూటములు కసరత్తు చేశాయి. ఈ క్రమంలో చిన్న, చితకా రాజకీయ పార్టీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ పార్టీల్లో కొన్ని 2019 లోక్‌సభ ఎన్నికలలో ఎట్లాంటి సీట్లు గెలవని ఉన్నాయి. అయితే.. ఆయా రాష్ట్రాల్లో వాటికి స్పష్టమైన ఓటు బ్యాంక్​ ఉండడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అందుకే దేశంలోని రెండు ప్రధాన కూటములకు ఇవి కీలకంగా మారనున్నాయి.

ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి OP రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఒక రోప్​గా ఉంటోంది. 2019లో ఆ పార్టీకి ఒక శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో బీజేపీకి సపోర్ట్​గా ఈ పార్టీ ఉంటోంది.  చిన్న పార్టీ అయితేనేమి.. ఫలానా కులానికి ప్రాతినిధ్యం వహిస్తే చాలు. అది పెద్ద కూటమికి లాభంగా మారుతుందన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది.

దీనికి మరో ఉదాహరణ ఏంటంటే.. UPలో అప్నా దళ్ 2019లో 1.2 శాతం ఓట్లు సాధించి, కేవలం రెండు సీట్లు మాత్రమే పొందింది. అయినప్పటికీ కుర్మీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను చీల్చడంలో ఆ పార్టీ బీజేపీకి సహాయపడింది. అదేవిధంగా జార్ఖండ్‌లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (AJSU) కూడా కేవలం 4.3 శాతం ఓట్లను పొందింది. 2019లో ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. అయితే ఇది కుష్వాహా కమ్యూనిటీ ఓట్లను చీల్చడంలో బీజేపీకి ఎంతో సహాయపడింది.

ఏపీలో జనసేనకు పెరిగిన ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్​లో పవన్​ కళ్యాణ్​కు చెందిన జనసేన పార్టీ.. 2019 ఎన్నికల్లో 137 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి కేవలం తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. జనసేన నుంచి రెండు చోట్ల పోటీచేసిన పార్టీ అధినేత పవన్​ కళ్యాణ్​ మాత్రం రెండు చోట్ల ఓటమిచెందారు. ఇక.. రాజోలులో గెలుపొందిన రాపాక వరప్రసాదరావు ఆ తర్వాత అధికార పార్టీ అయిన వైఎస్సార్​ కాంగ్రెస్​లో చేరారు. ఇక.. ఆ ఎన్నికల్లో జనసేన 5.53 శాతం ఓట్లను సాధించింది. ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 3.94కోట్ల ఓటర్లుండగా..  3.14కోట్ల ఓట్లు పోలింగ్​ అయ్యాయి. దీంట్లో జనసేన పార్టీకి 1.7 కోట్ల ఓట్లు వచ్చాయి. అయితే.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్​ పార్టీకి మాత్రం ఏపీలో గత ఎన్నికల్లో కేవలం 1.17పర్సంట్​ ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇక.. జనసేన లోక్​సభకు పోటీచేసినా ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

కులాల పేరిట మిత్రపక్షాలకు బీజేపీ ఎర..

2014, 2019 ఎన్నికలకు ముందు మిత్రపక్షాలను ప్రలోభపెట్టడానికి బీజేపీ ఇదే తరహాలో కసరత్తు చేసింది. ఇది అంటరాని పార్టీ కాదని, విస్తృత ఆకర్షణతో ఆమోదయోగ్యమైన పార్టీగా చూపించాలి అనుకుంటున్నందున మళ్లీ అదే తీరులో ఈసారి కూడా ఆ పార్టీ ఎత్తుగడలు వేస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక.. ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ సమావేశానికి మహారాష్ట్రకు చెందిన రెండు చిన్న పార్టీల నేతలు – ప్రహర్ జనశక్తి పార్టీ (పీజేపీ), జన్ సురాజ్య పార్టీ (జెఎస్‌పీ) హాజరయ్యారు. ఈ సమావేశానికి శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు పీజేపీ అధ్యక్షుడు ఓంప్రకాష్ అకా బచ్చు కడు, జేఎస్పీ వ్యవస్థాపకుడు వినయ్ కోరేను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఎన్‌డీఏ సమావేశానికి కడు, కోరే హాజరు కావడం బీజేపీ తన రాజకీయ పరిధులను విస్తరించే విషయంలో ఎటువంటి అవకాశాలను వదిలిపెట్టడం లేదని తెలుస్తోంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే లక్ష్యంలో బీజేపీకి తమ తమ నియోజకవర్గాల నుండి 50,000 నుండి లక్ష ఓట్లను సాధించిపెట్టగల ప్రతి ఒక్క నాయకుడు, వారి పార్టీ ఇప్పుడు అవసరం కానుంది.

మహారాష్ట్రకు సంబంధించినంతవరకు అక్కడి నాయకులు కడు, కోరె కనీసం రెండు లోక్‌సభ స్థానాలను – అమరావతి, హత్కనంగలే గెలుచుకోవడంలో ఎన్​డీఏకి సహాయపడగలరు. PJPకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు – ఓంప్రకాష్ కడు, రాజ్‌కుమార్ పటేల్ – అమరావతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన అచల్‌పూర్, మెల్‌ఘాట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉండగా, పటేల్ తొలిసారిగా ఎన్నికయ్యారు. అందుకనే స్వేచ్ఛగా వ్యవహరించే చిన్న పార్టీలను ప్రతిపక్షాలు చీల్చకుండా చూసుకోవాలని బీజేపీ చూస్తోంది. కాబట్టి చిన్న పార్టీలు అయినా తమ కూటమిలో కలుపుకోవాలని భావిస్తోంది.  

చందమామకు చేరువయ్యేలా చంద్రయాన్​–3 జర్నీ!

చంద్రయాన్ 3 వ్యోమనౌక జర్నీలో ఆటిట్యూడ్​ పెంచేందుకు సైంటిస్టులు ఇవ్వాల రెండో సారి బర్న్ చేపట్టారు. ఈ కార్యక్రమం సక్సెస్​ అయినట్టు ఇస్రో ఇవ్వాల (మంగళవారం) తెలిపింది. జూలై 14న చంద్రయాన్​–3 లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM3) రాకెట్‌లో ISRO చంద్రయాన్ 3 మిషన్‌ను ప్రారంభించిన దాదాపు ఒకటిన్నర రోజుల తర్వాత మొదటి బర్న్​ అమలు చేశారు. ఈ విధమైన ప్రక్రియతో క్రమంగా దాని కక్ష్యను పెంచే పనిచేపడుతున్నారు. ఈ విధానంతో ఇంధనాన్ని ఆదా చేసినట్టు అవుతుందని ఇస్రో వెల్లడించింది.

ప్రస్తుతం అంతరిక్ష నౌక భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి కక్ష్యతో గ్రహం నుండి దాని దూరాన్ని పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాత చంద్రయాన్ 3 భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, చంద్రునికి ఒక పథంలో వెళ్లడానికి దాని ఇంజిన్‌లను మళ్లీ మళ్లీ బర్న్​ చేసి వరుసగా ఆటిట్యూడ్​ (కక్ష్యలో ఎత్తు)ని పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది భూమి నుండి చంద్రుని వైపు మళ్లిన తర్వాత, చంద్రయాన్ 3లోని ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునిపై అంతరిక్ష నౌక యొక్క ఎత్తును తగ్గించడానికి మళ్లీ ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి మెళ్లగా ల్యాండ్​ అయ్యేందుకు వేగాన్ని తగ్గిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement