Sunday, May 19, 2024

రోడ్డుపై విరిగిప‌డ్డ భారీ చెట్టు, మ‌రోవైపు వ‌ర‌ద‌.. కాళేశ్వరానికి నిలిచిపోయిన రాకపోకలు

మహదేవపూర్ (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని జాతీయ రహదారి 363(సి) రహదారిపై అన్నారం క్రాస్ రోడ్ వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. దీంతో శనివారం అర్ధరాత్రి నుండి కాళేశ్వరానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కాలేశ్వరానికి అన్నారం, చంద్రవెల్లి నుండి రావలసిన రహదారిపై అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ రావడం తో కాళేశ్వరానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement