Tuesday, April 30, 2024

ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ఈరోజు మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ మంట‌ల‌ను అదుపు చేసేందుకు 10 ఫైరింజ‌న్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.. కంజూర్‌మార్గ్‌లోని ఎన్‌జీ రాయ‌ల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంత‌స్తుల భ‌వ‌నంలో 9వ అంత‌స్తు నుంచి అగ్నికీల‌లు ఎగిసిప‌డుతున్నాయి. ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకున్నాయి. మంట‌ల‌ను ఆర్పేందుకు 10 ఫైరింజ‌న్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. మిగ‌తా అంత‌స్తుల్లో నివాస‌ముంటున్న వారు భ‌యంతో అపార్ట్‌మెంట్‌ను వ‌దిలి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అయితే ఈ అగ్నిప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నేది తెలియ‌రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement