Thursday, May 2, 2024

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఖరీదైన కార్లు దగ్ధం

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌లో ఉన్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు కార్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో పెట్టిన ఓ ఖరీదైన కారుతోపాటు మరో మూడు కార్లు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని జింఖానా క్లబ్‌కు వచ్చిన సభ్యులు శాంగ్రీల ప్లాజాలో కార్లను పార్క్‌ చేశారు. అయితే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖరీదైన రేంజ్‌రోవర్‌ కారుతో పాటు మరో మూడు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. టైర్లకు మంటలు వ్యాపించి పేలడంతో పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో రోడ్డుమీద వెళుతున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement