Monday, April 29, 2024

బైక్ లో పెట్రోల్ లేద‌ని ఫైన్ -షాక్ అయిన వాహ‌న‌దారుడు

ద్విచ‌క్ర వాహ‌నంలో పెట్రోల్ త‌క్కువ‌గా ఉంద‌ని ఫైన్ వేశారు పోలీసులు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. మోటార్‌ సైకిల్‌లో పెట్రోల్ తక్కువ ఉందని ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. చలానా ఫోటో ఒకటి సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చలానా చూస్తే.. బసిల్ శ్యామ్ అనే వ్యక్తికి ఫైన్ వేశారు. రూ. 250 జరిమానా పడింది. సరిపడినంత ఫ్యూయెల్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారనే కారణంగా జరిమానా విధించారు.దాంతో శ్యామ్ ఫేస్‌బుక్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌పై ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో వన్ వే‌లో అపొజిట్‌గా వెళ్తున్నానని ట్రాఫిక్ పోలీస్ ఆపరాని వివరించారు.

దీని కోసం రూ. 250 జరిమానా కట్టాలని కోరినట్లు తెలిపారు. ఆఫీస్‌కు వెళ్లే తొందరలో చలానా రశీదు చూసుకోలేదని, ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత రశీదు చూసినట్లు తెలిపారు. అప్పుడు ఎందుకు జరిమానా పడిందనే విషయం తెలిసిందన్నారు. ఇలాంటి జరిమానా ఉందా అని ఇదర్దు ముగ్గురు లాయర్లను అడిగినట్లు శ్యామ్ పేర్కొన్నారు. వాళ్లు ఇలాంటి జరిమానా లేదని చెప్పార‌ని తెలిపాడు. కేరళ ట్రాన్స్‌పోర్ట్ చట్టాల ప్రకారం చూస్తే.. కమర్షియల్ వెహికల్స్‌కు మాత్రమే ఫ్యూయెల్ సంబంధిత జరిమానాలు విధించేందుకు అధికారం ఉంటుంది. ప్యాసింజర్లను గమ్య స్థానాలకు చేర్చే వెహికల్స్‌లో తగినంత ఫ్యూయెల్ కచ్చితంగా ఉండాలి. వెహికల్ బయలు దేరడానికి ముందే ఫ్యూయెల్ చెక్ చేసుకోవాలి. ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చేందుకు కావాల్సిన ఫ్యూయెల్ వెహికల్‌లో కచ్చితంగా ఉండాలి. లేదంటే జరిమానా పడుతుంది. పర్సనల్ వెహికల్స్‌కు ఇది వర్తించదు. అయితే పోలీస్ అధికారి టైపింగ్ తప్పు వల్ల ఇలా జరిగిందని శ్యామ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement