Wednesday, March 29, 2023

వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ, యాంత్రీకరణ : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

వ్యవసాయం రంగంలో ఆధునికీక‌ర‌ణ‌, యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్‌లోని శక్తిమాన్ ఇండస్ట్రీని మంత్రి నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలోని బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి రాకతో తెలంగాణ కూలీలంతా రైతులుగా మారారు. క్షేత్రస్థాయిలో కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోని 11 రాష్ట్రాల నుంచి వచ్చి వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ అనుబంధ రంగాలలో కూలీలుగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. యూపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా రాష్ట్రాల నుంచి కూలీల రాక ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయంలో వీలైనంత తొందరగా రైతాంగాన్ని యాంత్రీకరణ వైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement