Tuesday, April 30, 2024

కారు డోర్ ఓపెన్ చేసిన.. ఎలుగుబంటి

ఒక్కోసారి ప‌లు జంతువు చేసే ప‌నులు వైర‌ల్ గా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. అమెరికాలో ఓ ఇంటి బ‌య‌ట పార్క్ చేసిన కారులోకి ఎక్కేందుకు ప్ర‌యత్నించిన ఎలుగు బంటి వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఎలుగుబంటి కారులోకి ఎంట‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నించ‌గా అటుగా వెళుతున్న వారు కేక‌లు వేయ‌డంతో భ‌య‌ప‌డిన జంతువు పొద‌ల్లోకి పారిపోయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ప్యుబిటీ షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 1.3 కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియోలో ఎలుగుబంటి కారు వ‌ద్ద‌కు న‌డుచుకుంటూ వ‌చ్చి కారు డోర్‌ను ఓపెన్ చేస్తుంది. విండో నుంచి దీన్ని గ‌మ‌నిస్తున్న కుటుంబ స‌భ్యులు పెద్ద‌గా అర‌వ‌డం, స్దానికులు కేక‌లు వేయ‌డంతో భ‌య‌ప‌డిన జంతువు వెన‌క్కు వెళ్లిపోయింది. అయితే ఆ ఎలుగుబంటి ముఖంలో క‌న్ఫ్యూజ‌న్ స్పష్టంగా క‌నిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement