Sunday, May 16, 2021

ఏప్రిల్‌లో 75 లక్షల మంది ఉద్యోగాలు ఊస్టింగ్

కరోనా సెకండ్ వేవ్‌లోనూ ఉద్యోగాలు ఊస్టింగ్ అవుతున్నాయి. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. గత నెలలో దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సీఎంఐఈ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేశ్ వ్యాస్ తెలిపారు. ఫలితంగా నిరుద్యోగ రేటు మరింత పెరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఉద్యోగ కల్పన పెను సవాలుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

మార్చిలో 6.50 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగిత రేట ఏప్రిల్ నాటికి 7.97 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 9.13 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా ఉంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం ఉద్యోగాలపై పడిందని వ్యాస్ పేర్కొన్నారు. అయితే, గతంలోలా దారుణ పరిస్థితులు లేకపోవడం కొంత ఊరట కలిగించే అంశమన్నారు. గతంలో నిరుద్యోగ రేటు 24 శాతానికి చేరుకుందని వ్యాస్ గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News