Friday, May 17, 2024

ఓపెన్ జిమ్ లో 72ఏళ్ల బామ్మ – షాక్ అవుతోన్న యూత్

72ఏళ్ల బామ్మ ఏం చేస్తుంది అంటే ..ఏం అంటాం కృష్ణ‌..రామ అనుకుంటుంది అనుకుంటాం..అంతేనా శ‌రీరం స‌హ‌క‌రించ‌క మంచ‌మెక్కి ఉంటుంద‌నుకుంటాం..ఇక్క‌డ ఈ సూప‌ర్ బామ్మ ఏకంగా జిమ్ లో వ‌ర్క్ వుట్స్ చేస్తోంది. ఓపెన్ జిమ్‌లో ప్ర‌తిరోజూ క‌స‌ర‌త్తులు చేస్తుంది. అన్ని ప‌రిక‌రాల‌పై వ్యాయామం చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. యువ‌త‌రానికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్న‌ది. జ‌గిత్యాల జిల్లాలోని శంకుల‌ప‌ల్లె గ్రామానికి నీలి పెద్ద రాజ‌వ్వ వ‌య‌స్సు 72 ఏళ్లు. గృహిణి అయిన పెద్ద రాజ‌వ్వ‌కు ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఎక్కువ‌. ప్ర‌తి ఒక్క‌రూ ఫిట్‌గా ఉండాల‌నే ఉద్దేశంతో తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో పెద్ద రాజ‌వ్వ ప్ర‌తిరోజూ క‌స‌ర‌త్తులు చేస్తోంది. నిత్యం త‌ప్ప‌కుండా ఇక్క‌డికి వ‌చ్చి 40 నిమిషాలు వ్యాయామం చేస్తున్న‌ది. ఎక్స‌ర్‌సైజ్ చేస్తున్న‌ప్పుడు ఆమె కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ చూసి, అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement