Sunday, April 28, 2024

ఇండియ‌న్ పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏండ్లు.. అమ‌రుల‌కు నివాళుల‌ర్పించిన రాష్ట్రప‌తి, ప్ర‌ధాని

ఇండియ‌న్ పార్లమెంట్‌పై ఉగ్ర మూక‌లు దాడికి పాల్పడి ఇవాల్టికి సరిగ్గా 20 ఏండ్లు గడిచాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పార్ల‌మెంట్‌లో వాడివేడి చర్చ జరుగుతుండగా.. ఉగ్రవాదులు పార్లమెంట్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారింది. ఈ ఘటనలో 9మంది భారతీయులు చ‌నిపోయారు. ఈ దురాఘ‌తానికి ప్రధాన సూత్రధారి అయిన అఫ్జల్‌గురుపై అభియోగాలను నిర్ధారించిన ప్రత్యేక కోర్టు 2013 ఫిబ్రవరిలో ఉరిశిక్ష విధించింది.

ఆ రోజు ఏం జ‌రిగిందంటే..
2001 డిసెంబర్ 13 ఇండియ‌న్‌ పార్లమెంట్‌.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. సభలో హోంమంత్రి ఎల్‌కే అద్వానీ, ప్రమోద్‌ మహజన్‌ వంటి అతిరథ మహారథులతోపాటు ఎంపీలు, అధికారులు, జర్నలిస్టులూ ఉన్నారు. స‌రిగ్గా 11 గంట‌ల 02 నిమిషాల‌కు సభ వాయిదా పడింది. ప్రధానమంత్రి వాజ్‌పేయితోపాటు విపక్ష నేత సోనియాగాంధీ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ కాన్వాయ్‌ బయల్దేరేందుకు రెడీగా ఉంది. ఇదే సమయంలో గేట్ నెంబర్‌ 12 నుంచి తెల్లని అంబాసిడర్‌ కారు ఒక‌టి పార్లమెంట్‌లోకి దూసుకొచ్చింది. అక్కడే డ్యూటీ చేస్తున్న‌ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అలర్ట్ అయ్యి అంబాసిడర్‌ కారును నిలువరించేందుకు ప్ర‌య‌త్నించారు. ఉపరాష్ట్రపతి కాన్వాయిలోని ఒక వెహిక‌ల‌న్‌ని ఢీకొట్టిన ఉగ్రవాదులు.. ఒక్కసారిగా ఏకే 47తో విచ్చలవిడిగా కాల్పులు జరుపడం ప్రారంభించారు. గ్రనేడ్లు విసిరి గందరగోళం సృష్టించారు.

ఈ ఘ‌ట‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తీసిన‌ స్పెష‌ల్ ఓపీఎస్‌..
ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స్పెష‌ల్ ఓపీఎస్ వెబ్ సిరీస్‌లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తీశారు. ఉగ్ర‌దాడులు, కౌంట‌ర్ టెర్ర‌రిజంపై మెయిన్ ఫోక‌స్ చేస్తూ తీసిన స్పెష‌ల్ ఓపీఎస్ పార్ట్‌1, పార్ట్‌2 ఇప్పుడు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి.. ఇండియ‌న్ పార్ల‌మెంట్ ఘ‌ట‌న‌ను మొద‌టి పార్ట్‌లో స‌వివ‌రంగా చూడొచ్చు…

Advertisement

తాజా వార్తలు

Advertisement