Saturday, May 4, 2024

Flash: రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

హైదరాబాద్: వ‌న‌స్థ‌లిపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఇంజాపూర్ వ‌ద్ద ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన రెండు బైకులు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు యువ‌కులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని పరిశీలించారు. యువ‌కుల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement