Friday, April 26, 2024

స్థలం కోసం విరిగిన కుర్చీలు.. పోటాపోటీ కేసులు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట గ్రామ శివారు బతుకమ్మ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శుక్రవారం ఖాదరుపేట గ్రామానికి చెందిన రమేష్ కి, చెన్నారావుపేట పాలకవర్గం,ప్రజలకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల నుండి ఆ స్థలం నాదే అంటూ రమేష్..,బతుకమ్మ ఆడుకునే స్థలం అని చెన్నారావుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం,ప్రజలు వాదిస్తున్నారు. పది రోజుల క్రితం గ్రామ మహిళలతో కలిసి GP పాలకవర్గం హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. దీంతె శుక్రవారం స్థలం యజమానిగా చెప్పుకుంటున్న రమేశ్ కొంత మంది వ్యక్తులతో కలిసి మహిళలు నాటిన రాళ్లు తీసేసి మరో హద్దురాళ్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్,వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి అక్కడికెళ్లారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగి కుర్చీలు విరగొట్టుకున్నారు. అనంతరం ఇరువురు ఫిర్యాదు నిమిత్తం పోలీసు స్టేషన్ కి వెళ్లారు. పోటాపోటీగా ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం. అనంతరం బయటికి వస్తూ ఇరు పక్షా నాయకులు బాహాబాహకి దిగి తిట్ల దండకం అందుకోవడం,గమనించిన పోలీసులు ఇరు పక్షాలను సమీపం నుండి వెళ్లగొట్టరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement