Wednesday, May 15, 2024

Omicron Variant: 29 దేశాల్లో 373 కేసులు.. భారత్ లో తొలి ఒమిక్రాన్ కేసు

కరోనా కొత్త వేయింట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయినట్లు కేంద్రం ప్రకటించింది. బెంగళూరులోనే రెండు కేసులు వెలుగు చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ల పై అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 29 దేశాల్లో 373 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయని వెల్లడించారు.  అయితే, మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. ప్రజలనిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని కేంద్రం హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement