Saturday, May 11, 2024

త‌మిళ‌నాడులో 25మంది విద్యార్థుల‌కు క‌రోనా .. స్కూల్ మూసివేత ..

క‌రోనా ఓ ప‌క్క‌.. ఓమిక్రాన్ మ‌రోప‌క్క జ‌నాల‌ను భ‌యాందోళ‌న‌కి గురి చేస్తున్నాయి. కాగా త‌మిళ‌నాడులోని ఓ పాఠ‌శాల‌లో 25మంది విద్యార్థుల‌కు క‌రోనా అని తేలింది. తొలుత ఇద్దరు విద్యార్థులు కరోనా లక్షణాలతో ఓ హాస్పిటల్‌లో చేరగా.. వారికి టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత ఆ పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బంది అందరివి కలిపి 374 మంది శాంపిళ్ల తీసుకుని టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో మరో 25 మందికి కరోనా పాజిటివ్ అని ఫలితాలు వచ్చాయి. ఒమిక్రాన్ భయాల నడుమ పాజిటివ్ తేలిన వారి టెస్టు శాంపిళ్లను ఏ వేరియంట్ అని తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నారు.

తమిళనాడు తిరుప్పుర్ జిల్లా ధారాపురంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒంట్లో నలతగా ఉండటం, కరోనా లక్షణాలు కనిపించడంతో గతనెల 27న ఓ హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్ అయ్యారు. వారికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. స్కూల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ పాఠశాలను వారం రోజులపాటు మూసివేయడానికి ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పాఠశాల ప్రాంగణం అంతా డిస్‌ఇన్ఫెక్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ స్థాయిలో ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కరోనా నిబంధనల అమలు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement