Tuesday, April 30, 2024

Breaking : 14మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త .. ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు ..

పాఠ‌శాల‌లో విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కి గురి అయ్యారు. ఈ సంఘ‌ట‌న మ‌చిలీప‌ట్నం మైనారిటీ గురుకుల పాఠ‌శాల‌లో చోటు చేసుకుంది. 14మంది చిన్నారుల్లో తీవ్ర జ్వ‌రం, జ‌లుబు లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దాంతో వారిని హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు. చిన్నారుల నుంచి బ్ల‌డ్ శాంపిల్స్ సేక‌రించి ల్యాబ్ కి పంపారు. మరోవైపు అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రిలో వివిధ వార్డులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గురుకుల పాఠశాల సమీపంలోని మురికి నీళ్ల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి తల్లిదండ్రులు చెప్పారు. అక్కడ పెద్ద ఎత్తున దోమలు, పందులు చేరడంతోనే ఇలా జరిగి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. అయితే ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే దానిపై స్పష్టత రానుంది. త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement