Tuesday, April 30, 2024

కొత్త‌గా 10,753క‌రోనా కేసులు

కొత్త‌గా 10,753క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,753 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,97,269 కు చేరింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 49,622 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 93 శాతంగా ఉంది.ఇక దేశంలో 20 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,31,064 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6456 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,42,16,583 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,25,120 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 2,21,725 మందికి కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య‌శాఖ‌. ప్ర‌జ‌లంతా ..మాస్కులు ధ‌రించాల‌ని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement