Saturday, May 4, 2024

అండమాన్‌ నికోబార్‌లో 100 శాతం వ్యాక్సినేషన్ కంప్లీట్‌..

పోర్టుబ్లెయర్‌ : దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నా.. టీకా కొనసాగుతూనే ఉంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా అండమాన్‌ నికోబార్‌ దీవులు రికార్డు సృష్టించింది. కేవలం కొవిషీల్డ్‌ టీకాతో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడం గమనార్హం. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వ్యాక్సినేషన్‌ అత్యంత సవాల్‌తో కూడుకున్న వ్యవహారం అని, ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని టీకాలు వేశామని అక్కడి పాలకవర్గం తెలిపింది.

ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కి.మీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవులకు చేరుకుని వ్యాక్సిన్లు అందజేశామని పేర్కొంది. అక్కడ కూడా జనవరి 16నే టీకా వేయడం ప్రారంభమైంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ దీవుల్లో మొత్త జనాభాలో 74.67 శాతం మందికి టీకాలు అందాయి. ప్రస్తుతం ఇక్కడ రెండు క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటికే అర్హులందరికీ.. 100 శాతం రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చిన తొలి రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement