Sunday, April 28, 2024

ట్విట్టర్ కు కేంద్రం వార్నింగ్..

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కు, కేంద్రానికి మధ్య నడుస్తున్న వివాదంపై ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. కొత్త ఐటీ చట్టం అమలుకు ట్విట్టర్ కు తగిన సమయం ఇచ్చామని వెల్లడించారు. 3 నెలల సమయం ఇచ్చినా ట్విట్టర్ స్పందించలేదని ఆరోపించారు. ఇతర సంస్థలు ఐటీ చట్టాన్ని పాటిస్తుంటే ట్విట్టర్ కు అభ్యంతరమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించాలని ట్విట్టర్ ను అడిగామని, ట్విట్టర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. భారత సంస్థలు అమెరికాలో నిబంధనలు పాటిస్తున్నాయని, అలాంటిది ట్విట్టర్ కు భారత్ లో నిబంధనలు పాటించడంలో వచ్చిన ఇబ్బంది ఏమిటని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. భారత్ లో వ్యాపారం చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధానిని విమర్శించినా స్వాగతిస్తాం… కానీ నిబంధనలు పాటించడం మాత్రం తప్పనిసరి అని ట్విట్టర్ కు తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement