Friday, May 10, 2024

ఈసారి విద్యార్థులందరూ పరీక్షలు రాయాల్సిందే

తెలంగాణ: గత ఏడాది కరోనా వైరస్ సంక్షోభం విద్యారంగంపైనా పడింది. పరీక్షల సమయంలో లాక్‌డౌన్ రావడంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో గత ఏడాది 6-9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం వారిని తదుపరి తరగతులకు ప్రమోట్ చేసింది. టెన్త్ విద్యార్థులను మాత్రం ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేసింది.

కానీ ఈ ఏడాది పరిస్థితి అలా ఉండబోదని సమాచారం. ఈ ఏడాది మాత్రం 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. వార్షిక సిలబస్ తగ్గించి, విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశ్నాపత్రం తేలికగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారట. త్వరలోనే విద్యాశాఖ అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement