Monday, May 6, 2024

ఇకపై క్రికెట్ వరల్డ్‌ కప్‌లో 14 జట్లు.. టీ20 కప్‌లో 20..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ 2024-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్స్​ టూర్స్ అండ్ ప్రోగ్రామ్​ను మంగళవారం ప్రకటించింది. ఇకపై టీ-20 వరల్డ్‌ కప్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహాలోనే రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించగా.. ఇందులో 20 జట్లను తీసుకురానుంది. అలాగే 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్‌ టోర్నీని 14 జట్లతో ఆడించాలని, ప్రస్తుతం రెండు ఎడిషన్లుగా జరుగుతున్న చాంపియన్స్‌ ట్రోఫీల స్థానంలో నాలుగు ఎడిషన్లలో జరపాలని నిశ్చయించింది. వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 14 జట్లతో 2027, 2031లో ప్రపంచకప్​ జరుగనుండగా.. వీటిల్లో మొత్తం మ్యాచుల సంఖ్య 54కి పెరగనుంది. 2019 చివరిసారిగా జరిగిన వరల్డ్‌ కప్‌లో కేవలం కేవలం 10 పది జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 2024, 2026, 2028, 2030లో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌లో 20 జట్లతో జరుగనుండగా.. మొత్తం మ్యాచ్​ల సంఖ్య 55కి పెరుగనుందని ఐసీసీ పేర్కొంది. ఎనిమిది జట్లతో నిర్వహించే చాంపియన్స్​ ట్రోఫీని ప్రతి నాలుగేళ్లకోసారి.. అనగా 2025, 2029లో జరపనున్నారు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్​షిప్ ఫైనల్స్​ను ప్రతి రెండేళ్లకోసారి.. 2025, 2027, 2029, 2031లో నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement