Sunday, May 5, 2024

వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌ జట్టు.. శ్రీలంక, జింబాబ్వే క్రికెటర్లకు చోటు

వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌-2023 ముగియడంతో, టోర్నీలో విశేషంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. టోర్నమెంట్‌ చాంపియన్‌ శ్రీలంక, ఆతిథ్య జింబాబ్వే నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌ జట్టుకి ఎంపికయ్యారు. లంక ఓపెనర్‌ ప్రథుమ్‌ నిస్సాం, మిస్టరీ స్పిన్నర్‌ వనిందు హసరంగ, యువ స్పిన్నర్‌ మథీశ తీక్షణ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

- Advertisement -

జింబాబ్వే కెప్టెన్‌ సియాన్‌ విలియమ్స్‌, సికిందర్‌ రజా, రిచర్డ్‌ గరవ క్వాలిఫయర్స్‌ జట్టుకి ఎంపికయ్యారు. రన్నరప్‌ నెదర్లాండ్స్‌ జట్టు నుంచి విక్రమ్‌జిత్‌, బాస్‌ డి లీడె, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, స్కాట్లాండ్‌ క్రికెటర్లు బ్రాండన్‌ మెక్‌మిల్లెన్‌, క్రిస్‌ సోలె తుది జాబితాలో ఉన్నారు. వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ జట్టు: ప్రథుమ్‌ నిస్సాంక, వనిందు హసరంగ, యువ స్పిన్నర్‌ మథీశ తీక్షణ, సియాన్‌ విలియమ్స్‌, సికిందర్‌ రజా, రిచర్డ్‌ గరవ, విక్రమ్‌జిత్‌, బాస్‌ డి లీడె, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, బ్రాండన్‌ మెక్‌మిల్లెన్‌, క్రిస్‌ సోలె

Advertisement

తాజా వార్తలు

Advertisement