Friday, May 17, 2024

Women’s World Cup: మిథాలీ సేనను ఓడించిన ఆసీస్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన మహిళ జట్టు

ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా గెలిచింది. భారత మహిళా జట్టుతో ఆక్లాండ్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.  ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా..తాజా గెలుపుతో ఐదో విజయాన్ని నమోదు చేసింది.

భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు స్కోరు చేసింది. అయితే, ఆసీస్ జట్టు 4 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసి అదరగొట్టింది. తొలుత టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన భార‌త మహిళ జట్టు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఓపెన‌ర్లు స్మృతి మందాన (10), షెఫాలి వ‌ర్మ (12) పరుగుల‌కే పెవిలియ‌న్ బాట పట్టారు. త‌ర్వాత బ్యాటింగ్ కు వ‌చ్చిన యంస్తిక బాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్ (68), హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (57 నాటౌట్) రాణించారు. ఈ ముగ్గ‌రు నిల‌క‌డ‌గా రాణించి భారత్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. దీంతో భార‌త ఉమెన్స్ జ‌ట్టు 277 ప‌రుగులు చేసింది. ఇక, 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు రేచల్‌ హేన్స్‌(43), అలీసా హేలీ(72) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరికి తోడు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 97 పరుగులు సాధించి జట్టు విజయానికి బాటలు వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement