Thursday, May 2, 2024

ప్రపంచకప్‌కు ముందర టానిక్‌.. సునీల్ గ‌వాస్క‌ర్ స్వీట్ కామెంట్స్‌

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు ప్రపంచ చాంప్‌ ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్‌ విజయం టీమిండియాకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. టీ20 సిరీస్‌లో ప్రోటీస్‌ (సఫారీలు) గట్టి పోటీ ఇస్తారని భారతజట్టుకు బాగా తెలుసు. అందుకే ఆ రికార్డును మెరుగు పరచుకోవాలని కోరుకుంటారు. ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌ టోర్నీ గ్రూప్‌దశలో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. కాబట్టి ఈ సిరీస్‌ గెలవడం ద్వారా ఆత్మవిశ్వాసం కచ్చితంగా ఇనుమడిస్తుంది. ఆస్ట్రేలియన్‌ పేస్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమైనదైతే, దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలింగ్‌ మరింత కష్టమైనది. ఆసీస్‌ కంటే సఫారీ బౌలర్లు ఎక్కువ సామర్థ్యాలను కలిగివుండకపోవచ్చు. కానీ, కగిసో రబాడ, అన్రిచ్‌ నార్జే రూపంలో ఇద్దరు వేగవంతమైన బౌలర్లు పర్యాటకజట్టులో ఉన్నారు. వీరిద్దరు మ్యాచ్‌లో ఏ దశలోనైనా వికెట్లు తీయగలరు. ఇక లుంగీ ఎంగిడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ అతడు బంతిని రెండువైపులా స్వింగ్‌ చేయగలడు.

తన ఎత్తును గొప్పగా ఉపయోగించుకుంటున్నాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌లో ‘రోల్స్‌ రాయిస్‌’ మైఖేల్‌ హోల్డింగ్‌ తర్వాత కగిసో రబాడ కంటే మెరుగైన రన్‌ అప్‌ను రబాడ అందిపుచ్చుకున్నాడా అనే సందేహం కలుగుతోంది. అతను అప్రయత్నంగా వికెట్‌పైకి దూసుకెళ్లడాన్ని కామెంటరీ బాక్స్‌ నుంచి కనువిందు చేస్తుంది. అతను ఇన్నింగ్స్‌ ప్రారంభంలో విరామం పొందడం ద్వారా, ప్రత్యర్థిని బ్యాక్‌ఫుట్‌లో ఉంచుతున్నాడు. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే, దక్షిణాఫ్రికా చాలా వరకు క్విన్టిన్‌ డికాక్‌, అనుభవజ్ఞుడైన డేవిడ్‌ మిల్లర్‌పై ఆధారపడి ఉంటుంది. డికాక్‌ ముఖ్యంగా వైట్‌బాల్‌ క్రికెట్‌లో భారత బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఉంటాడు. స్వదేశంలోనూ, భారతదేశంలోనూ భారత బౌలర్లపై అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. కిల్లర్‌ మిల్లర్‌ డెలివరీల విషయంలో భారత బౌలర్లు అప్రమత్తంగా ఉంటారు. వీలైనంత త్వరగా అతనిని ఔట్‌ చేయాలని కోరుకుంటారు.

ఆసీస్‌పై భారత్‌ బ్యాటింగ్‌ బాగానే ఉంది. కానీ బౌలింగ్‌ మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. బుమ్రా మునుపటిలానే పదునైన యార్కర్లను సంధిస్తుండటం చాలా బాగుంది. చివరి గేమ్‌లో హర్షల్‌ పటేల్‌ కూడా తన లయను, విశ్వాసాన్ని తిరిగి పొందుతున్నట్లు కనిపించాడు. అక్షర్‌ పటేల్‌ అత్యద్భుతంగా రాణిస్తున్నాడు. అతను మరోసారి ఈ సిరీస్‌లో కీలక ఆటగాడు అవుతాడు. ఇది మరో ఉత్తేజకరమైన సిరీస్‌. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌కు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement