Thursday, May 2, 2024

Ambaji Peta Marriage Band Movie Review…సుహాస్ రీ సౌండ్ … హ్యాట్రిక్ విజ‌యం ..

కథే కంటెంట్…నటనే కటౌట్….అంటూ కలర్ ఫోటో , రైలర్ పద్మభూషణ్ చిత్రాలతో చిత్ర పరిశ్రమను తన వైపు తిప్పుకున్న సాదా సీదా నటుడు సుహాస్…అందం కాదు నటన ముఖ్యం …అందుకు బలమైన కథ కావాలి అని నమ్మిన నటుడు ఈ కుర్ర హీరో.. చిన్న నిర్మాత‌ల‌కు, కొత్త ద‌ర్శ‌కుల‌కు ఇప్ప‌డు అత‌డో సూప‌ర్ హీరో… మంచి క‌థ‌ను అత‌డు ముందు ప‌రిస్తే పారితోషికం అనే మాట లేకుండా నటించేస్తూ కాసులు కురిపిస్తున్నాడు.. తాజాగా అత‌డు న‌టించిన మూవీ అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ .. నేడు విడుద‌లై హిట్ టాక్ ను స్వంతం చేసుకుంది…

క‌థ విష‌యానికొస్తే ..
మల్లి (సుహాస్) అంబాజీపేటలో నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. అతడి తండ్రి ఊర్లో సెలూన్ షాపు నడుపుతుంటాడు. మల్లి అందులో పని చేస్తూనే మరోవైపు మ్యారేజీ బ్యాండులోనూ సభ్యుడిగా ఉంటాడు. అతడి కవల సోదరి అయిన పద్మ (శరణ్య) ఊర్లోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమె మీద వడ్డీ వ్యాపారం చేస్తూ ఊరిని పట్టి పీడిస్తున్న అగ్ర కులస్థుడు వెంకట్ (నితిన్ ప్రసన్న) కన్ను ఉంటుంది. మరోవైపు వెంకట్ చెల్లెలైన లక్ష్మి (శివాని నాగారం)తో మల్లి ప్రేమలో పడతాడు. వెంకట్ కు ఈ విషయం తెలిసి.. పద్మ పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తాడు. తనకు ఎదురొచ్చిన మల్లిని కూడా ఘోరంగా అవమానిస్తాడు. దీంతో ఊర్లో తలెత్తుకోలేని స్థితికి చేరుకుంటుంది వీరి కుటుంబం. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు మల్లి.. పద్మ ఏం చేశారు.. దాని పర్యవసానాలేంటి.. వీరి జీవితాలు చివరికి ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

విశ్లేషణ…
గ్రామంలో ధనిక పేద మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణ, ఎక్కువ తక్కువ అనే గొడవల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇది అప్పుడు, ఇప్పుడు సక్సెస్‌ ఫార్మూలాగానూ మారింది. ఈ క్రమంలో తాజాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ కూడా అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం. పెద్దింటి వాళ్లు తక్కువ కులం వారిని అవమానించడం, అప్పుల పేరుతో ఆస్తులు లాక్కోవడం, పేద, ధనికుల మధ్య ప్రేమ అనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమాలో చేసిన చిన్న మ్యాజిక్‌ ఏంటంటే ఇతర సినిమాల్లో ప్రేమ కోసం పోరాటం, ఇందులో అత్మాభిమానం కోసం పోరాటం హైలైట్‌గా చూపించారు. మొదటగా సుహాస్‌ పాత్రతో, ఆయన లవ్‌ ట్రాక్‌తో సినిమాని నడిపించి, ఇంటర్వెల్‌ వరకు పద్మ పాత్రలో నటించిన శరణ్యవైపు తిరుగుతుంది. ఆమె పాత్రనే హైలైట్ చేస్తూ తెరకెక్కించారు. మహిళా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఇందులో ఎమోషన్స్, డ్రామా యాడ్‌ అయ్యింది. ముఖ్యంగా శ‌రణ్య పాత్ర మ‌లిచిన తీరు మెచ్చుకోవ‌ల‌సిందే

నటీనటులుః
అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకి నటీనటులే బలం. వాళ్ల అద్బుతమైన నటన సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. మల్లీ పాత్రలో లవర్‌ బాయ్‌గా, అటు అక్క కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడే పాత్రలో అదరగొట్టాడు. సినిమాకి ప్రాణం పోశాడు. అయితే మొదటి భాగంలో సుహాస్‌ హీరోగా, సెకండ్‌ లో శరణ్య హీరోగా కనిపిస్తుంది. పద్మ పాత్రలో శరణ్య అదరొట్టింది. సినిమా అటెన్షన్‌ మొత్తం తనవైపు తిప్పుకుంది. ఆమె కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌ ప్రదర్శన ఇచ్చింది. హీరో ఫ్రెండ్‌ సంజీవ్‌గా జగదీష్‌ మెప్పించారు. వెంకట్‌ పాత్రలో నితిన్‌ అదరగట్టాడు. గోపరాజు రమణ తనదైన పాత్రతో మెప్పించాడు. ఇతర పాత్రధారులు ఓకే అనిపించుకున్నారు.

- Advertisement -
Advertisement

తాజా వార్తలు

Advertisement