Friday, April 26, 2024

ఐపీఎల్ లో కామెంటేట‌ర్ గా స్టీవ్ స్మిత్

మార్చి 31న ఐపీఎల్ 16వ సీజ‌న్ ప్రారంభం కానుంది. కాగా ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఐపీఎల్ లో కామెంటేటర్ గా అవతారం ఎత్తనున్నాడు. మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ తాజా సీజన్ లో తన వ్యాఖ్యానంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు టోర్నీ అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తో స్టీవ్ స్మిత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్-2023 కోసం స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ నిపుణుల ప్యానెల్లో తాను కూడా భాగం అయ్యానని స్మిత్ వెల్లడించాడు. కామెంటేటర్ గా సరికొత్త పాత్రలోకి ప్రవేశిస్తున్నానని వెల్లడించాడు. ఆటను బాగానే అర్థం చేసుకోగలనని, విశ్లేషించగలనని తెలిపాడు. ఐపీఎల్ లో స్టార్ స్పోర్ట్స్ బృందంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఐపీఎల్ లో అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించి, కెప్టెన్ గానూ వ్యవహరించిన స్టీవ్ స్మిత్ ను ఈ సీజన్ కోసం వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement