Friday, May 3, 2024

Sports | లాంగ్​ జంప్​లో వరల్డ్​ చాంపియన్‌షిప్‌కు శ్రీశంకర్‌ క్వాలిఫై

ఇండియన్‌ లాంగ్‌ జంపర్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ పతక విజేత మురళీ శ్రీశంకర్‌ 62వ జాతీయ అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ చాంపియన్‌షిప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టాడు. బుడాపెస్ట్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. తన ప్రారంభ ప్రాథమిక రౌండ్‌లో కేరళకు చెందిన 24 ఏళ్ల అంతర్జాతీయ అథ్లెట్‌ మురళీ 8.41 మీటర్ల జంప్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో హాంగ్‌జౌ ఆసియా క్రీడలతోపాటు, ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించాడు. 8.23 మీటర్లతో తన సొంత మీట్‌ రికార్డును కూడా మెరుగుపరుచుకున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement