Saturday, May 4, 2024

Big Breaking | బంగ్లాపై శ్రీలంకదే విజయం.. పోరాడి ఓడిన కుర్రాళ్లు

ఆసియా కప్‌ టోర్నీలో కీలకమైన సూపర్‌-4 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ షకిబుల్‌ హసన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. 258 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన బంగ్లా జ‌ట్టు ఆదిలోనే కీల‌క వికెట్ల‌ను పోగొట్టుకుంది. ఈ క్ర‌మంలో మ‌హ్మ‌ద్ నియామ్  (21), హసన్​ మీర్జా (28), లిట్టన్​ దాస్ (15), షకీబుల్​హసన్​ (3), ముఫ్తీకర్​ రహీమ్​ (29‌‌), షమీమ్​ హోసన్​ (5), నసూమ్​ అహ్మద్​ (15), ఇస్లాం (7), టాస్కిన్ (1) పరుగులు చేయగా.. వీరిలో ఒకే ఒక్కడు తౌహిద్​ హ్రిదోయ్​ (82) పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే.. శ్రీలంకకు కాస్త గట్టి పోటీ ఇచ్చినట్టే ఇచ్చిన బంగ్లా జట్టు చివరికి 236 పరుగులుచేసి ఆల్​ అవుటయ్యింది.

ఇక.. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్లు పథుమ్‌ నిసాంక (40), దిముథ్‌ కరుణరత్నె (18) జట్టుకు శుభారంభాన్నందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ 73 బంతులెదుర్కొని 6 ఫోర్లు ఒక సిక్సర్‌తో అర్థసెంచరీతో రాణించాడు. సదీరా సమరవిక్రమ 72 బంతుల్లో 2 సిక్సులు, 8 ఫోర్లతో 93 పరుగులు చేయగా, అతడికి చరిత అసలంక(10), కెప్టెన్‌ దసన్‌ శనక(24) సహకారమందించడంతో 257 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగల్గింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో హసన్‌ మహ్‌మూద్‌, తస్కిన్‌ అహ్మద్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా, షొరిఫుల్‌ ఇస్లామ్‌ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement