Friday, May 3, 2024

Archery World Cup ….భారత్ కు మూడు స్వర్ణాలు …స‌త్తా చాటిన జ్యోతి సురేఖ

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత ఆర్చర్లు అదరగొట్టేశారు. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది. మిక్స్‌డ్‌ డబుల్‌ ఈవెంట్, మహిళా జట్టు స్వర్ణాలు నెగ్గడంలో సురేఖ కీలక పాత్ర పోషించింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సురేఖ- అభిషేక్‌ వర్మ జోడీ ఫైనల్‌లో 158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై విజయం సాధించింది.

- Advertisement -

పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్‌, ప్రథమేశ్‌తో కూడిన భారత జట్టు నెదర్లాండ్‌కు చెందిన మైక్‌ స్కాలోసెర్, సిల్ పటెర్, స్టెఫ్‌ విలిమ్స్ టీమ్‌పై 238-231 తేడాతో అలవోకగా స్వర్ణం సాధించింది.

మహిళల జట్టు విభాగంలో ఇటలీకి చెందిన టీమ్‌పై భారత్‌ అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫైనల్‌లో స్వర్ణం గెలిచారు. వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌తో కూడిన టీమ్‌ఇండియా 236-225 తేడాతో ఇటలీ ఆర్చర్లు మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్‌పై ఘన విజయం సాధించడం విశేషం. ఇటలీ ప్లేయర్లు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో అంకిత బాకత్‌- బొమ్మదేవర ధీరజ్‌ జోడీ మెక్సికతో తలపడనుంది. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement