Friday, May 3, 2024

ఐపిఎల్ – సంజు శాంస‌న్ @50 – రాజస్థాన్ రాయల్స్ 18 ఓవ‌ర్ల‌లో 186/4

హైద‌రాబాద్ ఉప్ప‌ల్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ 2023 టోర్నిలో భాగంగా నేడు స‌న్ రైజ‌ర్స్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతున్న‌ది.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్ దిశ‌గా వెళుతున్న‌ది.. ఆర్ ఆర్ స్కిప‌ర్ సంజు శాంస‌న్ 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.. ఇందులో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి..
ఇక అంత‌కు ముందు రియాగ్ పరాగ్ ఏడు ప‌రుగులు చేసి న‌ట‌రాజ్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. దేవ‌ద‌త్త ప‌డిక్క‌ట్ మూడో వికెట్ రూపంలో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. ప‌డిక్క‌ల్ కేవ‌లం 2న ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.. అలాగే ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైశ్వాల్ 54 పరుగులు చేసి ఫారూఖీ బౌలింగ్ లో ఔటయ్యారు.. కాగా జైశ్వాల్ ఈ సీజ‌న్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే 34 బంతుల‌లో 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.. ఈ ప‌రుగుల‌లో8 ఫోర్లు ఉన్నాయి. ఇక‌ బట్లర్ రూపంలో తొలి వికెట్ కొల్పోయింది.. బట్లర్ వికెట్ ను ఫరూఖీ పడగొట్టారు.. బట్లర్ 22 బంతులలో 54 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. ప్ర‌స్తుతం స్కిప‌ర్ సంజు 55, హెట్మెయిర్ 10 ప‌రుగుల‌తోనూ క్రీజ్ లో ఉన్నారు.. 18 ఓవ‌ర్లు ముగిసేనాటికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నాలుగు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement