Monday, April 29, 2024

SA vs IND 2nd Test: ఆదిలోనే ఢ‌మాల్… 11 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

కేప్‌ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు జరుగుతోంది. ఈమ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. అయితే సౌతాఫ్రికా జ‌ట్టు ఆదిలోనే ఢ‌మాల్ అంది.

11 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా జ‌ట్టు స్కోరు 5 ప‌రుగులున్న స‌మ‌యంలో బ్యాట్స్ మెన్ మార్క్ ర‌మ్ ను భార‌త్ బౌల‌ర్ సిరాజ్ ఔట్ చేశాడు. అలాగే సిరాజ్ బౌలింగ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ఎల్గ‌ర్ ఔట‌య్యాడు. అనంత‌రం 11 ప‌రుగుల వ‌ద్ద స్ట‌బ్స్ మూడు ప‌రుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో ఔట‌య్యాడు. దీంతో సౌతాఫ్రికా జ‌ట్టు 11 ప‌రుగుల‌కే మూడు వికెట్ల‌ను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement