Monday, April 29, 2024

లక్నో సూపర్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ విజయం

లక్నో – ప‌ద‌హారో సీజ‌న్ ఐపీఎల్‌లో కొట్టింది త‌క్కువ స్కోరే.. అయినా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుతం చేసింది. బ‌ల‌మైన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 18 ప‌రుగుల తేడాతో గెలిచింది. తొలి రౌండ్ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది. స్లో పిచ్‌పై బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ల‌క్నోను 108కే ఆలౌట్ చేసింది. దాంతో, ఐదో విజ‌యం సాధించి ప్లే ఆఫ్ అవ‌కాశాలు మెరుగుపరుచుకుంది. 20 ఓవ‌ర్లో ల‌క్నో విజ‌యానికి 23 ర‌న్స్ కావాలి. అమిత్ మిశ్రా(19) క్యాచ్ ఔట‌య్యాడు. దాంతో, ల‌క్నో 108 ర‌న్స్‌కు ఆలౌట‌య్యింది. ప‌దో వికెట్‌గా వ‌చ్చిన కేఎల్ రాహుల్(0) నాటౌట్‌గా నిలిచాడు. దాంతో, ఆర్సీబీ 18 ప‌రుగుల తేడాతో గెలిచింది..

అంతకుముందు లక్నో. ముందుగా. విధ్వంసకర ఆటగాడు కైల్ మేయర్స్ అయితే సున్నా పరుగులకే వెనుదిరిగాడు. రెండో బంతికి అతడు షాట్ కొట్టబోగా.. అది 30 సర్కిల్ యార్డ్స్‌లో ఉన్న అనుజ్ రావత్ చేతిలోకి నేరుగా వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా.. మొదట్లో నిదానంగా తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా, ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు. హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. కానీ.. ఆ ఊపులోనే అతడు మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయుష్ బదోని సైతం ఆ వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. ఇక దీపక్ హుడా మరోసారి నిరాశపరిచాడు క‌ర‌న్ శ‌ర్మ ఓవ‌ర్లో స్టోయినిస్(13) ఔట‌య్యాడు. దాంతో ల‌క్నో ఆరో వికెట్ ప‌డింది.. ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ర‌వి బిష్ణోయ్(5) ర‌నౌట‌య్యాడు

ముందుగా టాస్ గెలిచి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేశారు. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ (31), డు ప్లెసిస్ (44) పుణ్యమా అని.. ఆర్సీబీ అంత మాత్రం స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అసలే ఇది బౌలింగ్ పిచ్. అందుకు తగినట్టుగానే లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి.. ఆర్సీబీని 126 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఈ మ్యాచ్ గెలవాలంటే.. లక్నో జట్టుకి 127 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే 108 పరుగులకు ఆలౌట్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement