Thursday, May 16, 2024

ర‌షీద్ నో-లుక్ సిక్స్.. వైర‌ల్ అయిన వీడియో

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ రషీద్ ఖాన్ తన ప్రాణాంతక లెగ్-స్పిన్ డెలివరీ చేయ‌డంలో స్పెషలిస్ట్, కాగా శనివారం, అతను పాకిస్తాన్ సూపర్ లీగ్‌ (PSL) 2022 మ్యాచ్‌లో.. తన అద్భుతమైన సిక్స్ కొట్టే నైపుణ్యాలను ప్రదర్శించి త‌న ఫ్యాన్స్ ని అబ్బుర‌ప‌రిచాడు. T20 టోర్నమెంట్‌లో లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడుతున్న రషీద్, ముల్తాన్ సుల్తాన్స్‌పై జట్టు స్కోరు 200 దాటడానికి కేవలం నాలుగు బంతుల్లో అజేయంగా 17 పరుగులు చేశాడు.

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో, షానవాజ్ దహానీ 137.1 కిలోమీట‌ర్ల వేగంతో బాల్ ని డెలివ‌రీ చేమ‌గా.. వ్యతిరేకంగా రషీద్ కిందకు వంగి, తన మణికట్టును ఉపయోగించి బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు విచిత్రమైన నో-లుక్ సిక్స్ కొట్టాడు, అది ట్విట్టర్‌లో వైరల్ అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement