Friday, May 3, 2024

రాజస్థాన్ గ్రేట్ విక్ట‌రీ.. చాంపియ‌న్స్​ ముంబైపై సునాయ‌స విజ‌యం

ఈ ఐపీఎల్‌లో లక్ష్యాన్ని కాపాడుకున్న ఏకైక జట్టు రాజస్థాన్. మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని కట్టడి చేయడంతో రాజస్థాన్ బౌలర్లు సఫలీకృతం అయ్యారు. అంతకుముందు జోస్ బట్లర్ (100), శాంసన్ (30), హెట్మెయర్ (35) రాణించడంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5) రెండో ఓవర్లోనే వెనుతిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (5) కూడా అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో ఇషాన్ కిషన్ (54), తిలక్ వర్మ (61) ముంబైని ఆదుకున్నారు. వాళ్లిద్దరూ క్రీజులో ఉంటే ముంబై లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. అయితే ట్రెంట్ బౌల్ట్ ఈ జోడీని విడగొట్టాడు. ఇషాన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అయితే.. క్రీజులో పొలార్డ్ ఉండటంతో ముంబై అభిమానులకు విజయంపై ఆశలు మిగిలే ఉన్నాయి. 19వ ఓవర్లో పొలార్డ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ జారవిడవడంతో ఉత్కంఠ నెలకొంది. ఒక లైఫ్ లభించిన తర్వాత పొలార్డ్ ఊరికినే ఉంటాడా? దంచి కొట్టడూ? అని ముంబై ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ చివరి రెండు ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైని అద్భుతంగా బౌలింగ్ చేసి పొలార్డ్‌ను భారీ షాట్లు ఆడకుండా చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, సైని రెండేసి వికెట్లు తీయగా.. బౌల్ట్, ప్రసిద్ధ్, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement