Saturday, May 4, 2024

23న రాహుల్,అతియాల వివాహం…

ముంబై -టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిలు వివాహ బంధంతో ఒక్క‌టికానున్నారు..గ‌త కొంత‌కాలంగాఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారు.. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ నెల 23న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు వివాహ వేడుకలు జరగనున్నట్టు మీడియా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ వివాహం మూడు రోజుల పాటు ఉంటుందని సమాచారం. ఖండాలాలోని (ముంబై సమీప ప్రాంతం) సునీల్ శెట్టి నివాసంలో జరిగే పెళ్లి వేడుకకు ప్రముఖులతో పాటు సన్నిహితులను ఆహ్వానించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement