Thursday, May 2, 2024

ODI WC 2023 : అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్.. కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసిన‌ ICC

దేశంలో జరిగే ప్ర‌పంచ క‌ప్ ఈవెంట్(marquee event)కు సంబంధించిన‌ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇవ్వాల (గురువారం) మళ్లీ విడుదల చేసింది. జింబాబ్వేలో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ ల‌లో శ్రీలంక , నెదర్లాండ్‌లు ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో తమ స్థానాన్ని బుక్ చేసుకున్నాయి.. దీంతో కొత్త షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ICC.

- Advertisement -

అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్

భారతదేశంలో జరిగే ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో శ్రీలంక & నెదర్లాండ్స్ రెండు జట్లు చేరాయి. హరారేలో జరిగిన క్వాలిఫయర్ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన శ్రీలంక, అక్టోబర్ 7న న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ప్రపంచ కప్ పోరాటీన్ని ప్రారంభించనుంది. ఆ త‌రువాత‌ నవంబర్ 9న బెంగళూరులో న్యూజిలాండ్‌తో తమ గ్రూప్ స్టేజ్ కాంపెయిన్ ని ముగించ‌నుంది.

ఇక‌, క్వాలిఫయర్‌లో రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ అక్టోబర్ 6న హైదరాబాద్‌లో పాకిస్థాన్‌తో ప్రపంచకప్ ఖాతా తెరవనుంది. స్కాట్ ఎడ్వర్డ్స్ జట్టు నవంబర్ 11న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో తమ గ్రూప్ స్టేజ్ కాంపెయాన్ ముగించనుంది.

సవరించిన CWC23 ఫిక్చర్‌లు

WC వేదిక

హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలో మొత్తం 10 వేదికలు ఉంటాయి. (హైదరాబాద్‌తో పాటు గౌహతి, తిరువనంతపురం సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 3 వరకు వార్మప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement