Saturday, May 11, 2024

మర్డర్ కేసులో వ్యక్తిని అరెస్టు చేసిన బోరబండ పోలీసులు..

హత్య కేసులో నిందితుడిని బోరబండ పోలీసులు నటరాజ్ నగర్ ఎర్రగడ్డ వద్ద అరెస్టు చేశారు. నిందితుడు మీరాజ్ అహ్మద్ (34) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా నందునగర్ నివాసి. అతని వద్ద నుంచి ఒక మటన్ కటింగ్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నటరాజ్ నగర్ లో గత కొంతకాలంగా ఫాతిమా (30), ఆమె భర్త మేరాజ్, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈమెకు గత కొన్ని సంవత్సరాల నుంచి భర్తతో వేధింపులున్నాయి. బక్రీద్ పండుగ సందర్భంగా ఫాతిమా భర్త మేరాజ్ తల్లిదండ్రులకు డబ్బు పంపించాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న రూ.3000 లు వారికి ఇవ్వాలని భార్యతో చెప్పాడు.

- Advertisement -

ఈ విషయంలో 26న భార్యాభర్తల మధ్య రాత్రి వాగ్వాదం జరిగింది. అదేవిధంగా మేరాజ్ కు గత కొంతకాలంగా భార్య ఫాతిమా ప్రవర్తన పైన అనుమానం ఉంది. భార్యను ఎలాగైనా చంపాలని అదే రోజు అతను పనిచేసే మటన్ షాప్ నుండి మటన్ కత్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దాంతో అర్ధరాత్రి సమయంలో పిల్లలు ఇంట్లో పడుకున్నప్పుడు భార్యను ఆ కత్తితో తల పైన విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి అతను పారిపోయాడు.

ఈ విషయంపై ఫాతిమా అక్క ఫిర్యాదు మేరకు పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు ఉత్తరప్రదేశ్ లోని తన స్వగ్రామం కు దగ్గరలో ఉన్నాడని నిర్ధారించుకొని బోరబండ పోలీసులు ఉత్తరప్రదేశ్ వెళ్లి అతని అరెస్టు చేసి ఈరోజు హైదరాబాద్ కు తీసుకొచ్చారు.అతని భార్యను చంపుటకు వాడిన కత్తిని సీజ్ చేసి, అతన్ని చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన బోరబండ సిఐ కామల్ల రవికుమార్, ఎస్సైలు సర్దార్ జమాల్ మనోజ్ కుమార్, కానిస్టేబుళ్లు రవి, ఈరం బాబు, లింగమూర్తి లను పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement