Monday, April 29, 2024

హాంకాంగ్ ప్లేయర్ అంగన్‌పై ప్రణయ్ విజ‌యం..

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ హాంకాంగ్‌ స్టార్‌ అంగస్‌కు షాక్‌ ఇచ్చాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో అన్‌సీడేడ్‌ ప్రణయ్‌ ఎనిమిదో సీడ్‌ అంగస్‌పై 13-21, 21-18, 21-19తేడాతో గెలిచి రెండో రౌండుకు చేరుకున్నాడు. తొలిసెట్‌ను 13-21తో కోల్పోయిన ప్రణయ్‌ అనూహ్యంగా పుంజుకుని 7-0తో ఆధిపత్యం సాధించి ఇక వెనుతిరిగి చూడలేదు.

వరుసగా 21-18, 21-19తేడాతో రెండుసెట్లను గెలుచుకుని రెండో రౌండుకు చేరుకున్నాడు. ప్రణయ్‌ రెండో రౌండులో మలేషియాకు చెందిన డారెన్‌తో తలపడనున్నాడు. ఇప్పటివరకు వీరిద్దరూ ఆరుసార్లు ముఖాముఖి తలపడగా ప్రణయ్‌కు ఇది రెండో విజయం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement