Wednesday, May 22, 2024

ఇన్ఫార్మ‌ర్ నెపంతో యువ‌కుడిని హ‌త‌మార్చిన మావోయిస్టులు

ఛ‌త్తీస్ గ‌ఢ్ సుక్మా జిల్లా ఎర్రబోరు గ్రామానికి చెందిన దారే నవీన్ అనే గ్రామస్థుడిని పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో గొంతు కోసి హత్య చేశారు మావోయిస్టులు. ఎర‌బోర పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని కాంగ్డా గ్రామానికి చెందిన దారె న‌వీన్ అనే యువ‌కుడిని మావోయిస్టులు అప‌హ‌రించి తీసుకువెళ్ళారు. గ్రామం స‌మీపంలో న‌వీన్ ని మావోయిస్టులు దారుణంగా హ‌త‌మార్చారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఇన్ఫార్మ‌ర్ నెపంతో మావోలు న‌వీన్ ని హ‌త‌మార్చినట్టు జిల్లా ఎస్పీ సునీల్ శ‌ర్మ నిర్థారించారు. కాగా ఘటనా స్థలంలో మావోయిస్టుల పేరుతో లేఖ కూడా వ‌దిలివెళ్ళారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement